: కష్టాల్లో పంజాబ్...ఆకట్టుకున్న గుజరాత్ బౌలర్లు
ఐపీఎల్ సీజన్ 9 లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, గుజరాత్ లయన్స్ జట్ల మధ్య రాజ్ కోట్ లో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ బౌలర్లు ఆకట్టుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు మురళీ విజయ్ (55), స్టోయిన్స్ (27) శుభారంభం ఇచ్చారు. అయితే షాన్ మార్ష్ (1), మ్యాక్స్ వెల్ (0), గురుకీరత్ సింగ్ (0) వరుసగా విఫలం కావడంతో పంజాబ్ జట్టు కష్టాల్లో పడింది. కెప్టెన్ మిల్లర్ (18), సాహా (3) క్రీజులో ఉన్నారు. దీంతో 15 ఓవర్లలో పంజాబ్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో కౌశిక్ 3 వికెట్లతో రాణించగా, జడేజా ఒక వికెట్ తీశాడు.