: వైకాపాను వీడేది లేదు: నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి


తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వస్తున్న వార్తలను గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఖండించారు. వైకాపాను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను పార్టీ మారనున్నట్టు వచ్చిన వార్తలపై వివరణ ఇచ్చే నిమిత్తం, కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారతానని జరుగుతున్న ప్రచారాన్ని తప్పుబట్టారు. కొన్ని పత్రికలు కావాలని ఇటువంటి ప్రచారాన్ని చేస్తున్నాయని విమర్శించారు. అధినేత వైఎస్ జగన్ తోనే తన ప్రయాణం కొనసాగుతుందని గోపిరెడ్డి అన్నారు.

  • Loading...

More Telugu News