: 40 లక్షల నిస్సాన్ కార్ల రీకాల్!


గతంలో తాము విక్రయించిన కార్లలోని ఎయిర్ బ్యాగులు, సీటు బెల్టుల అమరిక సరిగ్గా లేదని చెబుతూ, కార్ల తయారీ సంస్థ నిస్సాన్ 40 లక్షల కార్లను రీకాల్ చేసింది. ఈ కార్లు ప్రమాదానికి గురవుతున్నప్పుడు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అవుతున్నాయని, మరణాలు సంభవిస్తున్నాయన్న ఫిర్యాదులు అధికం కావడంతో, సంస్థ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. కాగా, కేవలం ఉత్తర అమెరికాలోనే 32 లక్షల కార్లలో లోపాలు ఉన్నట్టు తెలిపింది. డ్రైవర్ పక్కన సీటులో ఉండే ప్రయాణికుడి ముందుండే సెన్సార్ లో లోపాలున్నాయని, ఆ వ్యక్తిని ఓ చిన్నారిగా గుర్తిస్తూ, ప్రమాదాలు జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్ ను తెరవడం లేదని తెలుస్తోంది. 2016-17 సంవత్సరంలో విక్రయించిన నిస్సాన్ మాక్సిమా, 2013-16 మధ్య అమ్మిన అల్టిమా, ఎన్వీ 200, లీఫ్, సెంత్రా, పింక్ పాథ్ ఫైండర్ మోడళ్లతో పాటు 2014 తరువాత అమ్మిన ఎన్వీ 200 టాక్సీ, ఇన్ఫినిటీ క్యూఎక్స్ 60, రోగ్, మురానో, చెవర్లెట్ సిటీ ఎక్స్ ప్రెస్ తదితర వాహనాల్లో లోపాలున్నాయని, వీటిని ఉచితంగా సవరించి ఇస్తామని సంస్థ ప్రకటించింది. కార్ల యజమానులకు స్వయంగా సమాచారం అందిస్తున్నట్టు వెల్లడించింది.

  • Loading...

More Telugu News