: మామగారి సినిమా హిట్ కొట్టాలని రాంచరణ్ సతీమణి ప్రత్యేక పూజలు


తన మామగారు చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ, హీరో రాంచరణ్ భార్య ఉపాసన, అన్నవరం సత్యనారాయణస్వామికి ప్రత్యేక పూజలు చేసింది. తూర్పు గోదావరి జిల్లా చిరంజీవి అభిమాన సంఘం నేత కత్తిపూడి బాబి, మరికొందరు అభిమానులు ఆమెతో పాటు దేవాలయానికి రాగా, పండితులు స్వాగతం పలికి ప్రత్యేక పూజా ఏర్పాట్లు చేశారు. పూజల అనంతరం అనివేటి మండపంలో ఆశీర్వచనం పలికిన ఆలయ పూజారులు, ఆమెకు ప్రసాదాలు అందించారు. ఆపై ఉపాసన విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు.

  • Loading...

More Telugu News