: భక్త జనులతో తిరుమల కిటకిట!
భక్తులు వెల్లువలా తరలి రావడంతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లూ నిండగా, క్యూలైన్ వెలుపలకు రాగా, నారాయణగిరి ఉద్యానవనంలో భక్తులు వేచి చూస్తున్నారు. సర్వదర్శనం భక్తులు, దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చేందుకు 12 గంటల సమయం పడుతుండగా, నడకదారిన వచ్చిన భక్తులకు 9 గంటల సమయం పడుతోంది. శనివారం నాడు 70 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. క్యూలైన్లలోని భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు.