: రాత్రికి తీగలగుట్టపల్లిలో కేసీఆర్ బస


పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కరీంనగర్ జిల్లాలో నేడు పర్యటించనున్న తెలంగాణ ముఖ్యమంత్రి రాత్రికి తీగలగుట్టపల్లిలో బస చేయనున్నారు. మధ్యాహ్నం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరనున్న కేసీఆర్ సాయంత్రానికి కరీంనగర్ కు చేరుకుంటారు. అక్కడ వివిధ అభివృద్ధి పథకాల్లో భాగంగా చేపట్టిన నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఆపై స్థానిక టీఆర్ఎస్ నేతలు, పార్టీ కార్యకర్తలతో విడిగా సమావేశం కానున్నారు. తాజా రాజకీయాలు, జిల్లాలో పార్టీ మరింత బలోపేతంపై ఆయన సలహా, సూచనలు అందిస్తారని తెలుస్తోంది. సోమవారం నాడు ఆయన కాళేశ్వర, ముక్తేశ్వర దేవస్థానాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆపై మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను ఎంపీ బాల్క సుమన్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News