: నాకు టీడీపీ ఇచ్చిన ఆఫర్ రూ.20 కోట్లు, రాజధానిలో భూమి!: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ముత్యాలనాయుడు ఆరోపణ


తెలుగుదేశం పార్టీ నుంచి తనకు ఆఫర్ వచ్చిందని, రూ.20 కోట్లు, రాజధానిలో భూమి ఇచ్చేందుకు తనకు ఎర చూపారని విశాఖపట్టణం జిల్లాలోని మాడుగుల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఆరోపించారు. తనను పార్టీలో చేర్చుకునేందుకు సీఎం రమేష్ మధ్యవర్తిత్వం వహించారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ లను కలిసే ఏర్పాటు చేస్తానని సీఎం రమేష్ తనతో అన్నారని, అయితే, ఈ ఆఫర్ ను తాను తిరస్కరించానని చెప్పారు. తాను నమ్ముకున్న పార్టీని మోసగించడం తన రక్తంలో లేదని ముత్యాల నాయుడు అన్నారు.

  • Loading...

More Telugu News