: ప్రతిపక్షనేతలతో కలిసి విందు భోజనం చేసిన కేసీఆర్
తెలంగాణ ప్రతిపక్షనేతలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ విందు భోజనం చేశారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కుమార్తె వివాహం ఈరోజు హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి కేసీఆర్, పలువురు మంత్రులు, ప్రతిపక్ష నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, వివేక్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరినొకరు పలకరించుకున్నారు. అనంతరం, ఒకే టేబుల్ పై కేసీఆర్, జానారెడ్డి, షబ్బీర్ అలీ, వివేక్ తదితరులు విందు భోజనం చేశారు.