: మే 8న బుర్రిపాలెం వెళ్లనున్న ప్రిన్స్ మహేష్ బాబు
ప్రిన్స్ మహేష్ బాబు స్వస్థలం, దత్తత గ్రామం అయిన గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంలో ఆంధ్రా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మే 8వ తేదీన గ్రామంలోని ప్రతి కుటుంబానికి ప్రిన్స్ మహేష్ బాబు చేతుల మీదుగా హెల్త్ కార్డులు పంపిణీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఆరోజు కూడా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నామని ఆంధ్రా హాస్పిటల్స్ వైద్యుడు రామారావు తెలిపారు.