: హీరో శివాజీని వెంటనే అరెస్టు చేయాలి, దేశ ద్రోహం కేసుపెట్టాలి: సీపీకి బీజేపీ యువమోర్చా ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అవసరం లేదన్న కేంద్ర మంత్రి హెచ్.పి.చౌధురి వ్యాఖ్యలపై ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, సినీనటుడు శివాజీ నిన్న ఘాటుగా స్పందించిన విషయం విదితమే. రాష్ట్రం ఇక చీకట్లో మగ్గిపోవాల్సిందే అంటూ, మోదీ ప్రత్యేక హోదాపై పెదవి విప్పాలంటూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. శివాజీ వ్యాఖ్యలపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ యువమోర్చా స్పందించింది. శివాజీపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ‘దేశం నుంచి ఏపీని విడగొట్టాలన్న శివాజీపై కేసు నమోదు చేయాలి’ అంటూ విజయవాడ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసింది. హీరో శివాజీని వెంటనే అరెస్టు చేయాలని కోరింది. శివాజీపై దేశ ద్రోహం కేసుపెట్టాలని పేర్కొంది.