: తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కలిసే పోటీ చేస్తాయి: చినరాజప్ప
తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కలిసే పోటీ చేస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. విజయవాడలో ఈరోజు సైబర్‌క్రైం నిరోధంపై నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో టీడీపీ స్నేహాన్ని కొనసాగిస్తోందని, 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రజలు ఆందోళన చెందవద్దని చెప్పారు. ప్రధాని మోదీ గతంలో ఏపీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని వ్యాఖ్యానించారు.