: రేవంత్ రెడ్డి వల్లే టీ టీడీపీ సర్వనాశనమైంది!... మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్య
టీడీపీ టికెట్ పై శాసనసభ్యుడిగా ఎన్నికై ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరిన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి కారణంగానే తెలంగాణలో టీడీపీ సర్వనాశనమైందని ఆయన ఆరోపించారు. హైదరాబాదులోని తన నియోజకవర్గ పరిధిలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి ప్రత్యేక భద్రత ఏమీ అవసరం లేదన్న మాధవరం... ప్రజలను రెచ్చగొట్టి ఆయన పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పురుడుపోసుకున్న టీడీపీ... ఇప్పుడు ఆ పార్టీతో కలిసి ఎలా పనిచేస్తుందని కూడా మాధవరం ప్రశ్నించారు.