: మోదీ కేబినెట్ మంత్రిపై కేజ్రీ ప్రశంసలు!... బాగా పనిచేస్తున్నారని కితాబు


ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ పై నిత్యం విమర్శలు గుప్పించే ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్... అప్పుడప్పుడు అదే కేబినెట్ లోని మంత్రుల పనితీరుపై పొగడ్తలు కురిపిస్తుంటారు. ఇప్పటికే ఓ మారు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీపై కేజ్రీ ప్రశంసలు కురిపించారు. గడ్కరీ బాగా పనిచేస్తున్నారని ఆయన పొగిడారు. తాజాగా మరో కేంద్ర మంత్రి పనితీరును కేజ్రీ మెచ్చుకున్నారు. ఈసారి కేజ్రీ ప్రశంసలు అందుకున్నది కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు. రైల్వే ప్రయాణాన్ని సురక్షిత ప్రయాణంగా మార్చేందుకు సురేశ్ ప్రభు పలు కీలక చర్యలు చేపట్టారు. రైళ్లలో కూర్చున్న ప్రయాణికులు మెసేజ్ పంపితే చాలు.. వెనువెంటనే స్పందిస్తున్న ప్రభు, సదరు సమస్యలను క్షణాల్లో పరిష్కరించేస్తున్నారు. ఆపదలో ఉన్న ప్రయాణికుల పాలిట ఆయన నిజంగా ‘ప్రభువు’గానే మారిపోతున్నారు. ఈ క్రమంలో నేటి ఉదయం ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన కేజ్రీ... సురేశ్ ప్రభు బాగా పనిచేస్తున్నారని రైల్వే మంత్రిపై ప్రశంసలు కురిపించారు.

  • Loading...

More Telugu News