: అనకాపల్లిలో కిడ్నాప్ అలజడి.. యూకేజీ చదువుతోన్న ఎనిమిదేళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసిన దుండగులు
విశాఖ జిల్లా అనకాపల్లిలో ఓ బాలుడు కిడ్నాప్ అవడం అలజడి సృష్టిస్తోంది. స్థానిక పాఠశాలలో యూకేజీ చదువుతోన్న ఎనిమిదేళ్ల కొణతాల ఉదయ్ అనే బాలుడ్ని ఈ రోజు ఉదయం పలువురు దుండగులు కిడ్నాప్ చేశారు. అనంతరం బాలుడి తల్లిదండ్రులకి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. దీనిపై బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ బాలుడి కిడ్నాప్‌పై అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.