: తన ఆస్తుల విలువ రూ.7.73 కోట్లుగా పేర్కొన్న టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్
స్పాట్ ఫిక్సింగ్ కేసుతో జీవితకాల నిషేధం ఎదుర్కుంటోన్న టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఆమధ్య సినిమాల్లోకి వచ్చాడు. తాజాగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం విదితమే. యువత ఓట్లను రాబట్టడమే లక్ష్యంగా భాజపా శ్రీశాంత్‌ను కేరళ ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి బరిలోకి దింపింది. ఈ సందర్భంగా శ్రీశాంత్ తన ఆస్తుల వివరాలను వెల్లడించాడు. తన మొత్తం ఆస్తులు 7 కోట్ల 37 లక్షల రూపాయలుగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. దాంట్లో ఆయన వద్ద వ్యక్తిగతంగా కేవలం రూ.42,500 రూపాయల నగదు మాత్రమే ఉందని తెలిపాడు. 30లక్షలు విలువ చేసే ఓ బైక్ ఉందని వెల్లడించాడు. ఆయనకు 5.5 కోట్ల రూపాయల విలువ చేసే ఓ ఇల్లు, రూ.1.18 కోట్ల విలువ చేసే జాగ్వార్ ఎక్స్ జేఎల్ కారు ఉందని పేర్కొన్నాడు. ఇక తన భార్య వద్ద రూ.82 లక్షల రూపాయల విలువైన బంగారం ఉందని తెలిపాడు. ప్రపంచ కప్‌లో తాను అందుకున్న 5లక్షల విలువైన పతకం ఉందని పేర్కొన్నాడు.