: హుక్కా మత్తులో హైదరాబాదీ మైనర్లు... మెరుపు దాడులు చేసిన పోలీసులు


హుక్కా మత్తు హైదరాబాదీ మైనర్లను చిత్తు చేస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో అనధికారికంగా వెలసిన హుక్కా సెంటర్లు యువతను బాగానే ఆకట్టుకుంటున్నాయి. పోలీసులు ముమ్మర దాడులు చేస్తున్నా, హుక్కా సెంటర్లు మూతపడటం లేదు. తాజాగా నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత నగరంలోని మలక్ పేట పరిధిలోని పలు హుక్కా సెంటర్లపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. మొత్తం ఐదు హుక్కా సెంటర్లపై దాడులు చేసిన పోలీసులు సదరు సెంటర్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. దాడుల సందర్భంగా ఆయా సెంటర్లలో పలువురు యువకులు హుక్కా మత్తులో జోగుతూ కనిపించారు. వీరిలో తొమ్మిది మంది మైనర్లు కూడా ఉన్నారు. వీరందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు... వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

  • Loading...

More Telugu News