: సింగిల్ కాల్ తో రైలు టికెట్ రద్దు!... ‘139’ను ఆవిష్కరించిన సురేశ్ ప్రభు


అనుకోని కారణాలతో ప్రయాణం రద్దు అయ్యిందా? అప్పటికే బుక్ చేసుకున్న రైలు టికెట్ ను రద్దు చేసుకోవాలా? ఇందుకోసం రైల్వే రిజర్వేషన్ కౌంటర్ కు పరుగులు పెట్టాల్సిన అవసరం ఇక ఎంతమాత్రమూ లేదు. అక్కడ గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. చేతిలోని మొబైల్ ఫోన్ తీసి సింగిల్ కాల్ కొడితే సరి. బుక్ చేసిన టికెట్ ఇట్టే కేన్సిల్ అయిపోతుంది. ఈ తరహా కొత్త సౌకర్యాన్ని రైల్వే ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తూ ఆ శాఖ మంత్రి సురేశ్ ప్రభు నిన్న కీలక చర్యకు నాందీ పలికారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన ‘139‘ ను ఆయన నిన్న ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ విధానం కింద మనం బుక్ చేసుకున్న రైలు టికెట్ రద్దు చేసుకోవాలంటే... సింపుల్ గా సెల్ ఫోన్ తీసుకుని ‘139’కు డయల్ చేసి మన టికెట్ వివరాలు చెబితే, వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఇక ఈ ఓటీపీని ప్యాసింజర్ రిజర్వేషన్ వ్యవస్థ (పీఆర్ఎస్) కౌంటర్లో చెబితే... టికెట్ కు వెచ్చించిన మొత్తాన్ని మనకు ఇచ్చేస్తారు.

  • Loading...

More Telugu News