: బీహార్ లో మత్తుమందు పేస్ట్ పట్టివేత


బీహార్ రాష్ట్రంలో మత్తుమందు పేస్ట్ ను భద్రతా బలగాలు పట్టుకున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను బీఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ యూనిట్ డిప్యూటీ కమాండెంట్ ప్రవీణ్ కుమార్ రంజన్ తెలిపారు. కిషన్ గంజ్ జిల్లాలోని ఎస్ఎస్బీ క్యాంపు కార్యాలయం సమీపంలో ఇద్దరు స్మగ్లర్ల నుంచి 2.1 కిలోల మత్తుమందు పేస్ట్ ను భద్రతా బలగాలు పట్టుకున్నాయి. దీని విలువ సుమారు రూ.12.60 లక్షలు ఉంటుంది. నిందితులు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాకు చెందిన వారని, వారిని కిషన్ గంజ్ పోలీసులకు అప్పగించినట్లు ప్రవీణ్ కుమార్ రంజన్ చెప్పారు.

  • Loading...

More Telugu News