: ఏపీ ఇక చీకట్లో మగ్గాల్సిందే: హీరో శివాజీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక చీకట్లో మగ్గిపోవాల్సిందేనని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, హీరో శివాజీ వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఈ రోజు రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదంటూ ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హరిభాయ్ చౌదరి పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై హీరో శివాజీ స్పందిస్తూ, తెలుగు కేంద్ర మంత్రులు కేంద్రంలో కార్పొరేట్ పైరవీల్లో బిజీగా ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన కేంద్రమంత్రులకు సన్మానం చేయాలంటూ ఆయన ఎద్దేవా చేశారు.