: లోకేశ్.. రేపు సాయంత్రంలోగా చర్చకు డేట్, టైమ్ చెప్పు : అంబటి రాంబాబు
తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చర్చకు పిలిచే అర్హత నారా లోకేశ్ కు లేదని, లోకేశ్ తో చర్చకు తాను వస్తానని, లేదంటే తమ పార్టీ కార్యకర్తను పంపిస్తామని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. నారా లోకేశ్ ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారన్నారు. జగన్ ని చర్చకు పిలిచే అర్హత లోకేశ్ కు లేదన్నారు. ‘మీ స్థాయి ఏమిటి, ఎప్పుడైనా ప్రజల్లోకి వచ్చి గెలిచావా?’ అంటూ ఆయన ప్రశ్నలు సంధించారు. ఉత్తరకుమారుడిలా పారిపోవద్దని, చర్చ ఎప్పుడనే విషయమై రేపు సాయంత్రంలోగా డేట్, టైమ్ చెప్పాలని, చర్చా వేదిక ఎన్టీఆర్ భవన్ అయినా ఫర్వాలేదని, తాము సిద్ధంగా ఉన్నామంటూ అంబటి అన్నారు.