: ఇదోరకం నిరసన... నాగినీ డ్యాన్స్ చేసిన ఎన్సీపీ కార్యకర్తలు
మహారాష్ట్రలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసిన పద్ధతి నవ్వు తెప్పించే విధంగా ఉంది. మహారాష్ట్రలోని బుల్దానా టౌన్ లో రెండేళ్లుగా జరుగుతున్న రోడ్డు పనులు ఎంతకీ ముగియడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ విషయమై పీడబ్బ్యూడీ అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో, విసుగెత్తిపోయిన ఎన్సీపీ కార్యకర్తలు పీడబ్బ్యూడీ కార్యాలయానికి వెళ్లారు. అధికారులకు తమ ఫిర్యాదు అందజేశారు. అయితే, ఈ విషయమై అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో, ఎన్సీపీ కార్యకర్తలు నాగినీ డ్యాన్స్ చేశారు. వారు కూర్చున్న కుర్చీల చుట్టూ తిరిగేందుకు విఫలయత్నం చేశారు.