: వజ్రాన్ని మింగేసిన లక్కీ బామ్మ


అనగనగా అమెరికాలో ఓ విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. షాంపెయిన్‌ పార్టీ ఏర్పాటు చేసి గ్లాసు 20 డాలర్ల వంతున అధిక ధరలకు విక్రయించారు. విరాళాలు ఇవ్వదలచుకున్న జనం ఎగబడి షాంపెయిన్‌ సేవించారు. నిర్వాహకులు.. పాల్గొన్నవారిని ప్రోత్సహించే ఉద్దేశంతో కొన్ని వందల గ్లాసుల షాంపెయిన్‌లో ఒక దానిలో మాత్రం లక్కీ కానుకగా దక్కేలా ఒక వజ్రం వేసి.. మిగిలిన అన్నింటిలోనూ జిర్కాన్‌ రాతి ముక్కలను వేశారు. అదృష్టవంతులకు వజ్రం దొరుకుతుందని చెప్పారు.

ఇంతవరకు ఒక భాగం...

పాల్గొన్న వారంతా.. హాయిగా షాంపెయిన్‌ సేవించడం పూర్తిచేసి.. తమ తమ గ్లాసుల్లోని రాతిముక్కలను అక్కడి నిర్వాహకులతోనే పరీక్ష చేయించారు. అయితే అందరి గ్లాసుల్లో దొరికినదీ రాళ్లే అని తేలింది. అయితే ఒక గ్లాసులో వేసిన వజ్రం ఏమైనట్లు? అని అంతా విస్తుపోతుండగా.. 80 ఏళ్ల మిరియం అనే బామ్మ వచ్చి.. అసలు సంగతి వెల్లడించింది. తన గ్లాసులోని రాతిని.. పరాకుగా మింగేశానని సెలవిచ్చింది. వైద్యులు నానా పాట్లు పడి దాన్ని వెలికి తీసి పరీక్షించగా.. అదే అసలైన వజ్రం అని తేలింది. ఆ వజ్రాన్ని తన కుటుంబ ఆస్తిగా చేయాలని లక్కీ బామ్మ అనుకుంటోందిట.

  • Loading...

More Telugu News