: ఒలింపిక్స్ ఇండియన్ టీమ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్‌కి పిలుపు.. ఏఆర్ రెహమాన్‌నూ చేర్చుకునే దిశగా ఐఓఏ
బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో ఆగస్టు 5 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న 2016 ఒలింపిక్స్ ఇండియన్ టీమ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్‌ను నియమించాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐఓఏ సచిన్‌తో సంప్రదింపులు జరుపుతోంది. రియో ఒలింపిక్స్‌లో ఇండియన్ టీమ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌లలో ఒకరిగా వ్యవహరించాల్సిందిగా ఐఓఏ సచిన్‌కు లేఖ రాసింది. దీనిపై సచిన్ స్పందన కోసం ఐఓఏ ఎదురు చూస్తోంది. దీనిపై సచిన్ నుంచి సానుకూల స్పందనే వస్తుందని భావిస్తున్నారు. సచిన్ సహా భారత ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌ను కూడా భారత్ నుంచి బ్రాండ్ అంబాసిడర్‌ల టీమ్‌లో చేర్చాలని ఐఓఏ భావిస్తోంది.