: కరవు ఖిల్లాలో పసిడి నాణేలు!... ‘అనంత’ ఉప్పరిపల్లికి పరుగులు పెట్టిన అధికారులు


కరవు జిల్లాగా పేరుపడ్డ అనంతపురం జిల్లా భూముల్లో బంగారు నాణేలు దొరుకుతున్నాయట. అనంతపురం నగరానికి కూతవేటు దూరంలోని ఉప్పరిపల్లి గ్రామంలోని ఓ రైతు పొలంలో లెక్కలేనన్ని బంగారు నాణేలు ఉన్నాయన్న విషయం క్షణాల్లో జిల్లా వ్యాప్తంగా పాకింది. ఒకటా, రెండా... ఇప్పటికే ఏకంగా 20 బంగారు నాణేలు దొరికాయన్న సమాచారం అందుకున్న జనం పలుగు, పార పట్టుకుని సదరు పొలానికి పరుగులు పెడుతున్నారు. ఆ నోటా, ఈ నోటా విషయం తెలుసుకున్న అధికారులు రంగంలోకి దిగిపోయారు. బంగారు నాణేలు దొరికిన పొలంలోకి ఎవ్వరూ ఎంటర్ కాకుండా కట్టడి చేశారు. గడచిన కొద్దిరోజులుగా ఆ పొలంలో 20కి పైగా బంగారు నాణేలు దొరికాయి. వీటిని చేజిక్కించుకున్న అక్కడి ప్రజలు ఒక్కో దానిని రూ.3 వేల నుంచి రూ.3.5 వేలకు విక్రయించినట్టు తెలుస్తోంది. పొలంలో బంగారు నాణేలు లభిస్తున్న వైనం హాట్ టాపిక్ గా మారింది.

  • Loading...

More Telugu News