: పాకిస్తాన్కు న్యూక్లియర్ ఆయుధాలు ఉండటమే నిజమైన సమస్య, భారత్ సాయం కావాలి: ట‌్రంప్
అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ తన ప్రచారంలో భాగంగా పలుసార్లు పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ట్రంప్ ఇప్పుడు మరోసారి పాకిస్థాన్‌ను ప్రస్తావించారు. ఆ దేశానికి న్యూక్లియర్ ఆయుధాలు ఉండటమే అసలైన సమస్య అని అభిప్రాయపడ్డారు. అయితే పాకిస్థాన్ పూర్తి స్థాయిలో న్యూక్లియర్ వ్యవస్థ లేని దేశమని ట్రంప్ అన్నారు. పాకిస్థాన్ నుంచి ఎదురయ్యే సమస్యను నివారించడానికి భారత్ సాయం కావాలన్నారు. భారత్ లాంటి ఇతర దేశాల సాయంతో ఈ సమస్యను తగ్గించవచ్చని వ్యాఖ్యానించారు. అయితే పాకిస్థాన్‌తో తమకు స్వల్ప స్థాయిలోనే సత్సంబంధాలు ఉన్నాయని, వాటిని కొనసాగించడానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. ఒబామా ప్రభుత్వం అధిక మొత్తంలో డబ్బును పాక్కు సాయం చేసిందని అన్నారు. పాకిస్థాన్ ఇకపై కొనసాగించే చర్యలను గమనించిన తరువాత ఆ దేశంపై తమ స్పందన ఉంటుందని ట్రంప్ చెప్పారు.