: పాలేరు ఉపబరిలో నేడు కీలక ఘట్టం!... నామినేషన్ దాఖలు చేయనున్న తుమ్మల
ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికలో నేడు కీలక ఘట్టం నమోదు కానుంది. అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థిగా తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా (ఎమ్మెల్సీ)గా ఉన్న తుమ్మలను పార్టీ అభ్యర్థిగా ఖరారు చేస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే కేసీఆర్ నుంచి బీ ఫామ్ తీసుకున్న తుమ్మల నేడు భారీ అనుచర గణం వెంట రాగా తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేస్తారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎన్నికల ఇన్ చార్జీగా నియమితులైన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు.