: జగన్ ఢిల్లీ యాత్ర కాదు, కాశీ యాత్ర చేయాలి: మంత్రి దేవినేని
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది ఢిల్లీ యాత్ర కాదని, కాశీ యాత్ర చేయాలని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. కృష్ణా జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాలను జగన్ దెబ్బతీస్తున్నారని, జగన్ మొండిబాబు అని ఆయన పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారని అన్నారు. పొతే, టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో కృష్ణా జిల్లా సమస్యలపై చర్చించినట్లు దేవినేని చెప్పారు.