: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ మమతా కులకర్ణి భర్త అరెస్ట్


గతంలో తన చిత్రాలతో బాలీవుడ్ చిత్ర రంగాన్ని ఒక ఊపు ఊపిన హీరోయిన్ మమతా కులకర్ణి భర్త వికీ గోస్వామిని డ్రగ్స్ కేసులో నైరోబీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వ్యవహారంలో మమతా కులకర్ణిని కూడా కెన్యా పోలీసులు విచారణ చేస్తున్నారు. మమతా, వికీ జంట ప్రస్తుతం కెన్యా రాజధాని నైరోబీలో నివాసం ఉంటున్నారు. ఈ విషయమై నైరోబీ పోలీసు అధికారులు మాట్లాడుతూ, డ్రగ్స్ కేసుతో సంబంధాలున్నట్లు తేలితే కనుక మమతను భారత్ కు, వికీ గోస్వామిని అమెరికాకు అప్పగిస్తామన్నారు. కాగా, 1997లో డ్రగ్స్ అక్రమ రవాణా కేసుకు సంబంధించి వికీ గోస్వామిని దుబాయ్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోప‌ణ‌ల‌తో మ‌హారాష్ట్ర‌లోని థానే పోలీసులు మమతా కులకర్ణిపై కేసు నమోదు చేశారు. ఇటీవల 20 టన్నుల నిషేధిత ఎఫ్రిడిన్ మత్తు పదార్థాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం, మమతా కులకర్ణి భర్తే నిందితుడని చెప్పడం తెలిసిందే. నైరోబీ కేంద్రంగా సాగతున్న వారి డ్రగ్స్ రవాణా వ్యాపారాన్ని ప్రపంచంలోని పలు దేశాలకు విస్తరించారు.

  • Loading...

More Telugu News