: ఉద్యోగం నుంచి తొలగించారని విమానంపై కోపాన్ని చూపాడు.. భారీ క్రేన్‌తో ధ్వంసం చేశాడు
తనను ఉద్యోగం నుంచి తొలగించారంటూ ఓ విమాన సంస్థ ఉద్యోగి విమానాన్ని ధ్వంసం చేసిన ఘటన రష్యాలో చోటుచేసుకుంది. అతను విమానాన్ని భారీ క్రేన్‌తో ముక్కలు చేస్తున్నప్పుడు ఆ దృశ్యాలు అక్కడి కెమెరా కంటికి చిక్కాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాను ఇన్నాళ్లూ పనిచేసిన యుటీ ఎయిర్లెన్స్ కి చెందని విమానంపై తన ప్రతాపాన్ని చూపిస్తూ.. దాన్ని ఓ భారీ క్రేన్ సాయంతో కసితీరా ధ్వంసం చేశాడు. దీంతో సదరు కంపెనీకి మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది.