: విజయ్ మాల్యాను వెనక్కి పంపించండి: బ్రిటన్ హై కమిషనర్‌కు భారత విదేశాంగ శాఖ లేఖ
బ్యాంకులను నిండా ముంచేసిన కేసుతో భారత వ్యాపార వేత్త విజయ్ మాల్యా ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. మాల్యాను భారత్‌కు రప్పించేందుకు భారత విదేశాంగ శాఖ అన్ని రకాల చర్యలను చేపడుతోంది. ఈ విషయమై భారత విదేశాంగ శాఖ బ్రిటన్ హై కమిషనర్‌ను సంప్రదిస్తోంది. విజయ్ మాల్యాను భారత్ కు అప్పగించాలని బ్రిటన్ హై కమిషనర్‌ను కోరింది. ఈ విషయంలో బ్రిటన్ హై కమిషనర్‌కు లేఖ రాసింది. విచారణ కోసం ఈడీ ముందు హాజరు కావాల్సిందిగా మాల్యాకు నాలుగు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన వాటిని బేఖాతరు చేసిన విషయం తెలిసిందే. మాల్యాపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కూడా ఉంది.