: రెండు విడతలుగా దేశ వ్యాప్తంగా 'నీట్' పరీక్ష‌ నిర్వహించాలి: సుప్రీంకోర్టు ఆదేశం


నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ ఎంట్ర‌న్స్ టెస్ట్ (నీట్‌) ద్వారానే మెడిక‌ల్ కాలేజీల్లో ప్ర‌వేశాలు కల్పించాలని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం దేశ‌వ్యాప్తంగా ఏకీకృత ప్రవేశ పరీక్షను నిర్వ‌హించాల‌ని తెలిపింది. ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ అమ‌లు చేయాల్సిందేన‌ని స్పష్టం చేసింది. ఈ ప‌రీక్ష‌ను రెండు విడతలుగా దేశ వ్యాప్తంగా నిర్వ‌హించాల‌ని సుప్రీం సూచించింది. మే1, జులై 24న నీట్ ప‌రీక్ష‌ను నిర్వహించాల‌ని, ఆగష్టు 17న రెండు పరీక్షల ఫలితాలను ప్రకటించాలని తెలిపింది. సెప్టెంబ‌ర్ 30లోగా ప్ర‌వేశ కౌన్సెలింగ్ పూర్తి చేయాలని సుప్రీం సూచించింది. అక్టోబ‌ర్ 1 నుండి త‌ర‌గ‌తులు ప్రారంభించాల‌ని ఆదేశించింది.

  • Loading...

More Telugu News