: సైకిలెక్కేసిన సర్వేశ్వరరావు!... 16కు చేరిన ‘జంపింగ్’ ఎమ్మెల్యేల సంఖ్య


వైసీపీ టికెట్ పై శాసనసభ్యుడిగా గెలుపొందిన మరో ఎమ్మెల్యే టీడీపీలోకి చేరిపోయారు. విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కొద్దిసేపటి క్రితం విజయవాడలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నిన్న రాత్రే అనుచరవర్గంతో కలిసి అరకు నుంచి బయలుదేరిన కిడారి... కొద్దిసేపటి క్రితం విజయవాడ చేరుకున్నారు. విజయవాడ చేరుకున్న మరుక్షణమే నేరుగా చంద్రబాబు వద్దకెళ్లిన కిడారి... టీడీపీలో చేరిపోయారు. ఈ సందర్భంగా కిడారి, ఆయనతో పాటు వచ్చిన పలువురు నేతలకు చంద్రబాబు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిన్నటిదాకా టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 14కు చేరుకోగా... తాజాగా నేడు కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత కిడారిల చేరికతో ఆ సంఖ్య 16కు చేరింది.

  • Loading...

More Telugu News