: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అమరావతిలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. అక్కడి తాడేపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో రాజశేఖర్‌రెడ్డిని చంద్రబాబు పసుపు కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి అనుచరులు, మద్దతుదారులు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోయే సత్తా చంద్రబాబు నాయుడికే ఉందంటూ బుడ్డా రాజశేఖర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.