: పాతబస్తీలో కార్డన్‌సెర్చ్.. వెలుగులోకొచ్చిన అక్ర‌మాలు.. 30 మంది బాల కార్మికులకు విముక్తి


హైద‌రాబాద్‌లోని పాతబస్తీలో భారీగా అక్ర‌మాలు జ‌రుగుతున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈరోజు తెల్ల‌వారు జామున అక్క‌డి రెయిన్‌బజార్, ఫలక్‌నుమా, మొగల్‌పురా, చాంద్రాయణగుట్ట, భవానీనగర్ పరిధిలో నిర్వహించిన కార్డన్‌సెర్చ్‌ (కట్టడి-సోదా)లో 200మంది పోలీసులు పాల్గొన్నారు. నేర చరిత్ర ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్న‌ట్లు స‌మాచారం. అక్క‌డి ప్ర‌సిద్ధ‌ గాజుల తయారీ పరిశ్రమలపై దాడులు చేసి 30 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. మామిడి పండ్లను ర‌సాయ‌నాల‌తో మ‌గ్గ‌పెడుతోన్న వ్యాపారుల‌ను అరెస్టు చేశారు. అనారోగ్యం క‌లిగించే జంతువుల కొవ్వుతో నూనె తయారు చేస్తున్న కేంద్రంపై దాడి చేశారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. కార్డ‌న్ సెర్చ్ లో భాగంగా ప‌లువురు అనుమానితుల‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News