: తెలంగాణ తెచ్చిన గొప్పదనం ముందు ముఖ్యమంత్రి పదవి ఎంత?: కేసీఆర్


‘తెలంగాణ తెచ్చిన గొప్పదనం ముందు ముఖ్యమంత్రి పదవి ఎంత?’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి బాధ్యతలను తన భుజాన వేసుకున్నానన్నారు. తెలంగాణ ప్రధాన నినాదం ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అని, ఇందులో రెండు సమస్యలు తీరిపోయాయని అన్నారు. మన బడ్జెట్ లో ప్రతిరూపాయి మనకు ఖర్చవుతుందని, నిధులు వేరే చోటకు తరలిపోయే ప్రశ్నే లేదని అన్నారు. అదేవిధంగా, నియామకాలు... తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినా తెలంగాణ బిడ్డలకే దక్కుతాయన్నారు. ఇంకా తీరాల్సింది సాగునీటి సమస్య అని అన్నారు. ఖమ్మం జిల్లాలో పలు నదులు పారుతున్నాయని, మంచినీటి సమస్యతో ఈ జిల్లా ప్రజలు ఎందుకు బాధపడాలని ఆయన ప్రశ్నించారు. అందుకోసమే రీఇంజినీరింగ్ చేసి ఖచ్చితంగా తెలంగాణలో ఒక కోటి ఎకరాలకు సాగునీరు తీసుకురావడానికి ప్రణాళిక రూపకల్పన జరిగిందన్నారు. రూ.25 వేల కోట్ల రూపాయలను ఈ ఏడాది బడ్జెట్ లో కేటాయించామన్నారు.

  • Loading...

More Telugu News