: సీపీఐ నేత డి.రాజాను కలిసిన జగన్...ఫిరాయింపుల వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణిస్తామన్న సీపీఐ నేత


ఢిల్లీలో ఉన్న వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బృందం సీపీఐ నేత డి.రాజాను కలిసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణల అంశాన్ని, పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని ఆయనకు వివరించారు. భేటీ అనంతరం రాజా మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్ తమ దృష్టికి తీసుకొచ్చిన అంశాలను పార్టీలో చర్చిస్తామని, ఫిరాయింపుల వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణిస్తామని అన్నారు. పార్టీ మారిన వ్యక్తులు, ఆ పార్టీ ద్వారా వచ్చిన అన్ని పదవుల నుంచి తప్పుకోవాలని, చట్టంలోని లొసుగులను ఉపయోగించుకోవడం సరికాదని అన్నారు. పార్టీ ఫిరాయింపులనేవి కేవలం ఒక్క రాష్ట్రానికే పరిమితమైన అంశం కాదని, అన్ని రాష్ట్రాల్లోనూ ఇది సమస్యగా మారిందన్నారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఏం జరిగిందో ఏపీలోనూ అదే జరుగుతోందన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం వందశాతం ఉందని డి.రాజా అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News