: ఈ ముఖ్యమంత్రి నాటకాలాడుతున్నారు, ఏదో ఒకటి చేయాలి: ఢిల్లీ సీఎంపై బీజేపీ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు


‘ఈ ముఖ్యమంత్రి అరాచకవాది, నాటకాలాడుతున్నారు... ఈ సీఎంను ఏదో ఒకటి చేయాలి’ అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు లోక్ సభ జీరో అవర్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వాయు కాలుష్య నివారణ నిమిత్తం ఢిల్లీలో అమలులో ఉన్న సరి-బేసి సంఖ్య విధానంపై రమేశ్ బిధూరి చర్చ లేవనెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఢిల్లీలో ముఖ్యమైన సమస్యలు ఆయనకు పట్టవని, సరి-బేసి సంఖ్య విధానం పేరిట ఆయన నాటకాలాడుతున్నారని తీవ్రంగా ఆరోపించారు. ఢిల్లీ మెట్రో నాలుగో ఫేజ్ పనులు మొదలు కావాల్సి ఉండగా ఇప్పటివరకు ఆ పనులు ప్రారంభం కాలేదన్నారు. సీఎం కేజ్రీవాల్ నిర్లక్ష్యం వల్లే ఈ మెట్రో పనులు పూర్తి కాలేదని రమేశ్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News