: 'నాడు చంద్రబాబు రాయబారం పంపారన్న' బాలమేధావి మాటలకు పగలబడి నవ్విన కేసీఆర్!


ఖమ్మంలో ఈరోజు జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో బాలమేధావి లక్ష్మీ శ్రీజ సభా వేదికపై నుంచి పలు విషయాలను మాట్లాడింది. చిన్న వయస్సులోనే అంత జ్ఞాపక శక్తి ఉన్న చిన్నారిని చూసి పలువురు ఆశ్చర్యపోయారు. కేసీఆర్, టీఆర్ఎస్ ప్రస్థానం ... ఇలా పలు అంశాల గురించి మాట్లాడుతూ, ‘2000 సంవత్సరంలో ఎన్డీఏ కొత్త రాష్ట్రాలను ఏర్పరుస్తూ దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రయత్నించగా చంద్రబాబు అడ్డుపడ్డారు. టీడీపీ నుంచి బయటకు రావడానికి మేధావులను, విద్యార్థులను, ఎన్జీవో సంఘ నేతలతో కేసీఆర్ చర్చలు ప్రారంభించారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో స్పందించిన చంద్రబాబు, కేసీఆర్ కు కోరుకున్న మంత్రి పదవి ఇస్తానని రాయబారం పంపారు. దీనిని సున్నితంగా తిరస్కరించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నా ధ్యేయమని ప్రకటించారు’ అని శ్రీజ పేర్కొనడంతో సీఎం కేసీఆర్ పగలబడి నవ్వారు.

  • Loading...

More Telugu News