: మే 1 తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌లు మహారాష్ట్ర బయటే నిర్వహించాలి: సుప్రీం
మహారాష్ట్ర నుంచి ఇతర ప్రాంతాలకు ఐపీఎల్ మ్యాచ్లను తరలించాలని బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఐపీఎల్ నిర్వాహకులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టులోనూ వారికి నిరాశే ఎదురైంది. మే 1 తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌లు మహారాష్ట్ర బయటే నిర్వహించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో మహారాష్ట్రలో ముంబై, పుణె, నాగ్పూర్ వేదికల్లో జరగాల్సిన 13 మ్యాచ్‌లు వేరే రాష్ట్రాల్లోని మైదానాలపై జరగనున్నాయి. మహారాష్ట్రలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడడంతో పిచ్‌లను తడిపేందుకు నీళ్లు ఇవ్వబోమని మహారాష్ట్ర సర్కార్ స్పష్టం చేసిన విషయం విదితమే.