: సైకిలెక్కేసిన గొట్టిపాటి... వెల్ కమ్ చెప్పిన చంద్రబాబు
ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పార్టీ మారిపోయారు. వైసీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కొద్దిసేపటి క్రితం టీడీపీ కండువా కప్పుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని తన నివాసం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలతో కలిసి వచ్చిన గొట్టిపాటికి విజయవాడలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఘన స్వాగతం పలికారు. పార్టీ కండువా కప్పి గొట్టిపాటిని టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. గొట్టిపాటి వెంట వచ్చిన వైసీపీ నేతలకు కూడా చంద్రబాబు పార్టీ కండువాలు కప్పారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ఏపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు, మంత్రులు నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. టీడీపీలో చేరిన వెంటనే ఆ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసిన గొట్టిపాటి ఘన నివాళి అర్పించారు.