: ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనపై కాసేపట్లో సుప్రీంలో విచారణ.. సర్వత్రా ఉత్కంఠ
ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనపై మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇటీవలే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీంతో కొంత ఊరట పొందిన కేంద్రం.. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలననే కొనసాగించాలని భావిస్తోంది. ఆ రాష్ట్ర హైకోర్టు రాష్ట్రపతి పాలనను రద్దు చేయడంపై కేంద్రం సుప్రీంను ఆశ్రయించడంతో ఈ విషయమై ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ జరగనుంది. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలననే కొనసాగించాలని తమ వాదనలను కేంద్రం ఈరోజు అత్యున్నత న్యాయస్థానానికి వినిపించనుంది. సుప్రీంకోర్టు ఈ విషయమై మళ్లీ ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తోందోనన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.