: జార్ఖండ్‌లో నీటి ఎద్దడి.. వ్యక్తి ఆత్మహత్య
దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితి నెలకొన్న విషయం విధితమే. జార్ఖండ్‌లోని గిరిధ్ జిల్లాలో ఏర్పడిన నీటి ఎద్దడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు కారణమైంది. అక్కడి పూర్ణానగర్ గ్రామవాసి దిలీప్ యాదవ్.. రూ.70వేలు అప్పు చేసి నీటి కోసం బోరు వేయించాడు. అయితే అతని ఫలితం సఫలం కాలేదు. 700 అడుగుల లోతుకు బోరు వేసి, నీటి కోసం ప్రయత్నించినా అతనికి నిరాశే మిగిలింది. దీంతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్ర, జార్ఖండ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో నీటి నిల్వలు తగ్గిపోయి.. కనీస అవసరాలకే కాకుండా.. తాగడానికి కూడా నీళ్లు దొరకడం గగనమైపోయింది. దీంతో ప్రజలు గుక్కెడు నీళ్ల కోసం నానా అవస్థలు పడుతున్నారు.