: వైసీపీకి గుడ్ బై చెప్పేసిన మైసూరారెడ్డి... జగన్ కి మాట నిలకడ లేదని వ్యాఖ్య


వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ అధినేత‌కు త‌న రాజీనామా లేఖ‌ను పంపారు. జ‌గ‌న్‌కు నాలుగు పేజీల రాజీనామా లేఖ‌ను రాశారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన‌ మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఇంకా ఏ పార్టీలో చేరాల‌నే విష‌యాన్ని ఆలోచించ‌లేద‌ని చెప్పారు. పార్టీ నేత‌లపై తాను ఎటువంటి ష‌ర‌తులు పెట్ట‌లేద‌ని తెలిపారు. తాను ఏ పార్టీలో ఉన్నా న‌మ్మ‌కంగానే ప‌నిచేశాన‌ని వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా మైసూరా రెడ్డి జ‌గ‌న్‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శలు చేశారు. వైసీపీ అధినేత‌కు అధికార పీఠం పైనే మక్కువ ఉందని అన్నారు. జ‌గ‌న్‌కు మాట నిల‌కడ లేదని విమ‌ర్శించారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడాల‌న్న సంక‌ల్పం జ‌గ‌న్‌కు లేద‌ని అన్నారు. తాను చెప్పిన స‌ల‌హాల‌ను జ‌గ‌న్‌ ఆచ‌రించ‌డం లేదని చెప్పారు. వైసీపీలో డబ్బుకి తప్ప వ్యక్తులకు ప్రాధాన్యత లేదని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News