: అద్దంకిలో వైసీపీ ఖాళీ!... గొట్టిపాటి వెంటే టీడీపీలోకి వైసీపీ కేడర్!


ప్రకాశం జిల్లా అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గంలో విపక్ష వైసీపీకి ఇక సింగిల్ కార్యకర్త కూడా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. వైసీపీ టికెట్ పై ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవికుమార్... నేడు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ‘సైకిల్’ ఎక్కనున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని తన ఇంటి నుంచి గొట్టిపాటి భారీ అనుచరగణంతో నేటి ఉదయం విజయవాడకు బయలుదేరనున్నారు. అద్దంకి నియోజకవర్గంలోని స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ నేతలంతా గొట్టిపాటి వెంటే నడిచేందుకు నిర్ణయించుకున్నారు. నేటి చేరికల్లో భాగంగా గొట్టిపాటితో పాటు వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీపీలు, ముగ్గురు జడ్పీటీసీలు, 36 మంది ఎంపీటీసీలు, 47 మంది సర్పంచ్ లు, 19 మంది సహకార సంఘాల అధ్యక్షులు, ఐదుగురు మునిసిపల్ కౌన్సిలర్లు నేడు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వీరితో పాటు వారి అనుచరవర్గం కూడా టీడీపీలోకే వెళ్లనుంది. ఈ నేపథ్యంలో అద్దంకిలో ఇకపై వైసీపీకి సింగిల్ కార్యకర్త కూడా ఉండడని ప్రచారం సాగుతోంది.

  • Loading...

More Telugu News