: దువ్వాడ సెజ్ లో భారీ అగ్నిప్రమాదం


విశాఖపట్టణంలోని దువ్వాడలో ఉన్న సెజ్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బయోమాక్స్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగింది. అక్కడే ఉన్న పదకొండు డీజిల్ ట్యాంకుల్లో మూడు ట్యాంకులు పేలిపోయాయి. ఎగసి పడుతున్న మంటలను అదుపు చేసేందుకు మూడు వాహనాలతో అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. సంఘటనా స్థలానికి మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్, సీపీ అమిత్ గార్గ్ చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News