: తిరుపతి విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన


తిరుపతి విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళన బాట పట్టారు. ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం కావడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సి ఉన్న ఎయిర్ ఇండియా విమానం బయలుదేరకపోవడంతో 175 మంది ప్రయాణికులు పడిగాపులు గాస్తున్నారు. ఈ విషయమై విమానాశ్రయ అధికారులు స్పందించటం లేదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదంటూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News