: దొరా! చేతనైతే చంద్రబాబును ప్రశ్నించు, ఎంక్వైరీ నువ్వు చెయ్!: ఒక ఛానెల్ విలేకరితో వైఎస్ జగన్


‘చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన 23 నెలల కాలానికే లక్షా ముప్ఫై నాలుగు వేల కోట్ల రూపాయల పైచిలుకు కరెప్షన్ చేశారు’ అని ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. వెంటనే ఒక టీవీ ఛానెల్ విలేకరి స్పందిస్తూ.. ‘మీపై లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు చేశారు కాబట్టి, ఈ రోజున అంతకంటే ఎక్కువగా లక్షా ముప్ఫై నాలుగు వేల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు చంద్రబాబుపై చూపిస్తున్నారు!’ అని ఆ విలేకరి అన్నారు. దీనికి జగన్ సమాధానమిస్తూ, ‘దొరా, నువ్వు ఏ టీవీ ఛానెల్ విలేకరో నాకు తెలియదు. ప్రతిపక్షంలో ఉండేది మేము. అధికార పక్షంలో ఉండేది వాళ్లు. రెండేళ్ల తర్వాత జీవో కాపీలతో సహా మేము చూపిస్తూ ఉన్నాము. విత్ ఎవిడెన్స్ చూపిస్తా ఉన్నాము. చేతనైతే, ఎంక్వయిరీ నువ్వు చెయ్. చేతనైతే చంద్రబాబు నాయుడిని ప్రశ్నించు. ఎందుకు అవినీతి చేస్తా ఉన్నావు? ఇది అవినీతిగా కనపడటం లేదా? అని చంద్రబాబునాయుడు గారిని ప్రశ్నించు’ అని జగన్ అన్నారు.

  • Loading...

More Telugu News