: నా డ్రీమ్ ప్రాజెక్టు ‘రామాయణం’: సినీ హీరో విష్ణు మంచు
‘నా డ్రీమ్ ప్రాజెక్టు ‘రామాయణం’. ఈ చిత్రాన్ని ఎన్ని భాగాలుగా చూపించాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. త్వరలో దీనికి సంబంధించిన వివరాలను తెలియజేస్తాను’ అని సినీ హీరో విష్ణు తెలిపారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాలనే ఉద్దేశంలో ఉన్నామన్నారు. ప్రముఖ మాటల రచయిత తనికెళ్ల భరణి స్క్రిప్ట్ ఆధారంగా రూపొందుతున్న 'కన్నప్ప' చిత్రం ప్రీప్రొడక్షన్ దశలో ఉందన్నారు. నటుడిగా తనకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన చిత్రం ‘రౌడీ’ కాగా, సంతృప్తి నిచ్చిన చిత్రం ‘అనుక్షణం’ అని మంచు విష్ణు చెప్పాడు.