: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు


ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 328 పాయింట్లు లాభపడి 26,007 వద్ద ముగిసింది. నిఫ్టీ 108 పాయింట్లు లాభపడి 7,963 వద్ద క్లోజయింది. ఎన్ఎస్ఈలో హిందాల్కో సంస్థ షేర్లు అత్యధికంగా 4.93 శాతం లాభపడి రూ.103.25 వద్ద ముగిశాయి. వీటితో పాటు ఐడియా, ఇండస్ బ్యాంక్, యస్ బ్యాంక్, టాటా పవర్ సంస్థల షేర్లు కూడా లాభపడ్డాయి. కాగా, అదానీ పోర్ట్స్ సంస్థ షేర్లు అత్యధికంగా 1.21 శాతం నష్టపోయి రూ.229 వద్ద ముగిశాయి. భారతీ ఇన్ ఫ్రాటెల్, హీరో మోటా కార్ప్, అల్ట్రాటెక్ సిమెంట్, బీపీసీఎల్ సంస్థల షేర్లు నష్టాలతో ముగిశాయి.

  • Loading...

More Telugu News