: ఏపీ ఎంసెట్ : ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించమంటున్న అధికారులు
ఈ నెల 29వ తేదీన ఏపీ ఎంసెట్ నిర్వహించనున్నారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని ఎంసెట్ కన్వీనర్ సాయిబాబా పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎంసెట్ కు 2.92 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో 1.89 లక్షల మంది, మెడిసిన్ విభాగంలో 1.03 లక్షల మంది, తెలంగాణ రాష్ట్రంలో 42 వేల మంది విద్యార్థులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. ఎంసెట్ నిర్వహణకు ఆంధ్రాలో 494 కేంద్రాలు, తెలంగాణలో 52 కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కొన్ని సూచనలు చేశారు. ఓఎంఆర్ షీట్లను నీలం బాల్ పాయింట్ పెన్ తో పూరించాలని, పరీక్షా కేంద్రాల్లోకి స్మార్ట్, ఎలక్ట్రానిక్ వాచీలతో వచ్చే విద్యార్థులను అనుమతించమని, పరీక్షా కేంద్రాల వద్ద జామర్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో గోడ గడియారం ఏర్పాటు చేయనున్నట్లు సాయిబాబా తెలిపారు.